కలం, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) ఎండింగ్ కు వచ్చేసింది. కళ్యాణ్ పడాల విన్నర్ అనే ప్రచారం జరుగుతున్న టైమ్ లో.. కొత్త ట్విస్ట్ ఒచ్చింది. ఎస్.జే.సుందర్ అనే ఆర్మీ జవాన్ ఓ సంచలన వీడియో రిలీజ్ చేశారు. కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ కాదని.. సీఆర్ పీఎఫ్ లో పనిచేసి ఒచ్చాడని చెప్పాడు. ఆర్మీ రూల్స్ ను బ్రేక్ చేసి బయట తిరుగుతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు సుందర్. కళ్యాణ్ పడాలకు ముందు నుంచి ఆర్మీ అనే సెంటిమెంట్ ఎక్కువగా వర్కౌట్ అయింది. అందుకే బిగ్ బాస్ కూడా కళ్యాణ్ ను బాగా ఎంకరేజ్ చేశాడు. ఓటింగ్ లో మనోడు దూసుకుపోతున్నాడు. కచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతాడనే టైమ్ లో ఇలా జరగడంపై కొత్త రచ్చ మొదలైంది.
ఈ విషయంలో కొందరు కళ్యాణ్ కు సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు. సీఆర్ పీఎఫ్ అయినా దేశ సేవే కదా అంటున్నారు. కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఓటేయాలని ఎన్నడూ చెప్పలేదని.. తన ఆటతోనే క్రేజ్ సంపాదించుకున్నాడని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. నాగార్జున కూడా కళ్యాణ్ ఆటకు సెల్యూట్ కొట్టడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంకొందరేమో కళ్యాణ్ ఆర్మీ కాబట్టే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) కు క్రేజ్ కలిసొస్తుందని అతన్ని హైలెట్ చేస్తోందని చెబుతున్నారు. టైటిల్ విన్నర్ ఎపిసోడ్ ముందర ఈ రచ్చ కళ్యాణ్ కు నెగెటివ్ అవుద్దా లేదంటే టైటిల్ లిఫ్ట్ చేస్తాడా అనేది చూద్దాం.
Read Also: మార్ఫింగ్ న్యూడ్ ఫొటోలపై సింగర్ చిన్మయి రియాక్షన్
Follow Us On: Youtube


