కలం, నిజామాబాద్ బ్యూరో: చాలా మందికి ఓటేయాలంటేనే బద్దకం అయిపోతోంది నేటి రోజుల్లో. ఓటేస్తే ఏమొస్తుంది.. మన పని పోతుంది కదా అనుకుంటారు. కానీ ఓటు హక్కు ఎంత ముఖ్యమో చెప్పే ఘటన మరోసారి జరిగింది. అనారోగ్యంతో ఉన్నా సరే.. అంబులెన్సులో వచ్చి మరీ ఓటేశారు ఇద్దరు. నిజమాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు (Sarpanch Elections) జరిగాయి. సాలూరు మండలం జాడి జమాల్ పూర్ గ్రామంలో ఓటింగ్ జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు తాము నడవలేని స్థితిలో ఉన్నా సరే అంబులెన్స్ లో వచ్చారు. ఎన్నికల అధికారులు స్వయంగా అంబులెన్స్ వద్దకు వచ్చి వారితో ఓటును వేయించారు. ఆరోగ్యం బాగా లేకున్నా.. ఓటు విలువను కాపాడి ఆదర్శంగా నిలిచారు ఆ ఇద్దరు. ఆ ఇద్దరినీ ఎలక్షన్ ఆఫీసర్లు అభినందించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: బ్యాలెట్ పేపర్ చించేసిన ఓటర్ అరెస్ట్
Follow Us On: Instagram


