epaper
Monday, March 2, 2026
epaper

మార్ఫింగ్ న్యూడ్ ఫొటోలపై సింగర్ చిన్మయి రియాక్షన్

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద (Singer Chinmayi Sripada).. అంశం ఏదైనా తన అభిప్రాయాలను సూటిగా చెప్పేస్తుంది. మొహమాట పడకుండా ధైర్యంగా మాట్లాడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లు ఎదుర్కొనే అనేక సమస్యలపై ఎన్నోసార్లు స్పందించింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల మహిళలు మంగళసూత్రం వేసుకోవాలా? వద్దా? అనే విషయమై మాట్లాడింది. ‘ఓ మహిళ మంగళసూత్రం వేసుకోవడమనేది తన వ్యక్తిగత విషయం‘ అని తేల్చి చెప్పడంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. కొందరు చిన్నయి పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేసి కామెంట్లు చేశారు. అయినా ఆమె అధైర్యపడలేదు.

ప్రస్తుతం సింగర్ చిన్మయి (Singer Chinmayi) న్యూడ్ మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఓ సోషల్ మీడియా పేజీలో మార్ఫింగ్ న్యూడ్ ఫొటో చూశానని, తన ఫొటోలు మార్పింగ్ చేశారన్నారు. ఆ పోస్టును పోలీసులకు ట్యాగ్ చేశానని చిన్మయి అన్నారు. ఆ తర్వాత డీప్ ఫేక్, AI టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మార్ఫింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయన్నారు. అమ్మాయిలు, మహిళలు అలర్ట్‌గా ఉండాలని చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నందుకుగాను తనను లైంగికంగా వేధించారని, పిల్లలను సైతం చంపుతామని బెదిరించినట్టు చిన్మయి వాపోయింది. Video

Read Also: షాకింగ్.. 50 శాతం US గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు నిల్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!