ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో బయటపడిన కల్తీ మద్యం వెనక అసలు మాస్టర్ మైండ్స్ టీడీపీ నేతలేనంటూ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) ఘాటు విమర్శలు చేశారు. ప్రతిచోట కల్తీ మద్యం కోసం కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి, ప్రతి పల్లెకు కల్తీ మద్యాన్ని సరఫరా చేసిన ఘటన తెలుగు దేశం పార్టీదేనంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘మాపైన లిక్కర్ స్కాం కేసులు బనాయించారు. అసత్యప్రచారాలు చేశారు. వైసీసీ నేతలెందరినో జైళ్లకు పంపారు. కానీ, ఇప్పుడు మీ అసలు రంగ బయటపడింది. ప్రతి చోట కల్తీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. వాళ్లకి ఇప్పుడు దేవుడే సమాధానం ఇచ్చారు. అందులో టీడీపీ తరుపున పోటీ చేసిన వ్యక్తే నకిలీ మద్యం డెన్ పెట్టడం, అదే దొరకడమే ఆ దేవుడిచ్చిన సమాధానం’’ అని భూమన అన్నారు.
ప్రతి బ్రాందీ షాపు కూడా కూటమి హయాంలో బెల్ట్ షాపుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యాన్ని(Illegal Liquor) ప్రతి పల్లెకు సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటేసినందుకు ప్రజల ప్రాణాలనే పణంగా పెట్టి టీడీపీ నేతలు సంపాదించుకోవడానికి రెడీ అయ్యారు. చంద్రబాబు(Chandrababu) సంపద సృష్టిస్తా అంటే ఏమో అనుకున్నామని, ఆయన చెప్పింది తమ నేతల సంపద అని ఇప్పుడే అర్థమైందని ఆయన(Bhumana Karunakar Reddy) చురకలంటించారు.

