ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh).. సోమవారం ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా లోకేష్ తన పర్యటన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ముంబై(Mumbai)లో జరిగే ఐసీసీ పార్టనర్‌షిప్ 30వ సమ్మిట్ రోడ్ షోలో లోకేష్ పాల్గొననున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది నవంబర్‌లో విశాఖ వేదికగా జరిగే పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు కీలక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పలు కీలక సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించారు.
తన ముంబై టూర్‌లో నారా లోకేష్(Nara Lokesh).. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్(Natarajan Chandrasekaran), ట్రాఫిగురా సీఈఓ సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ హెడ్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సాదత్ షా, హెచ్‌పీఐఎన్‌సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూస్టార్ లిమిటెడ్ డిప్యూటీ ఛైర్మన్ వీర్ అద్వానీ సహా మరికొందరు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు.

