కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. హరీశ్ రావు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు ముమ్మాటికీ అవాస్తవమని స్పష్టం చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పనిగట్టుకొని చేస్తున్న ఇలాంటి చిల్లర ప్రచారాలను కార్యకర్తలు, ప్రజలు ఎవరూ నమ్మవద్దని పార్టీ విజ్ఞప్తి చేసింది.
బీఆర్ఎస్ (BRS) పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం, కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మనందరి ఏకైక లక్ష్యమని పార్టీ పేర్కొంది. కాగా, పార్టీ అధికారికంగా చేసిన ఈ పోస్ట్‌ను హరీశ్ రావు స్వయంగా రీ-పోస్ట్ చేస్తూ, తనపై వస్తున్న అసత్య ప్రచారాలకు గట్టి సమాధానం ఇచ్చారు.
Read Also: అల్లు అర్జున్ను కాంగ్రెస్ అరెస్ట్ చేయలేదా?.. రాహుల్‌పై తమిళిసై ఫైర్
Follow Us On : WhatsApp


