ఆర్గానిక్ బాటలో ఖమ్మం రైతులు.. వినూత్న సాగుతో లాభాలు

కలం, ఖమ్మం బ్యూరో: ప్రస్తుత రైతులు అధిక లాభాలతోపాటు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోని బూర్గంపాడు మండలం, లక్ష్మీ పురం గ్రామంలో పలువురు రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. రసాయన ఎరువులకు గుడ్‌బై చెప్పి, సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అలాగే ఒకే రకం పంట మీద ఆధారపడకుండా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు లాంటి పంటలు పండిస్తున్నారు. నేల నాణ్యతతో పాటు పంట దిగుబడులు కూడా పెంచుకుంటున్నారు.

యారం లక్ష్మీ రెడ్డి, మేడిపల్లి ఉదయ్, పోతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డితోపాటు మరికొంతమంది ఆర్గానిక్ సాగు చేస్తున్నారు. వీరు మంచి ఫలితాలు సాధిస్తుండటంతో గురువారం కలెక్టర్ జితేష్.వి.పాటిల్ పంటలను సందర్శించారు. వ్యవసాయంతో (Agriculture)పాటు అనుబంధంగా చేపల పెంపకం, తేనెటీగల పెంపకం కూడా చేపట్టి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సూచించారు. ఆర్గానిక్ పంటలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఆర్గానిక్ వ్యవసాయం‌పై దృష్టి సారించాలని రైతులకు సూచనలు చేశారు.

Read Also: రూ.13వేల కోట్ల విలువైన ఆన్​లైన్​ గేమింగ్​ సిండికేట్​ బద్దలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>