epaper
Sunday, February 22, 2026
epaper

రూ.13వేల కోట్ల విలువైన ఆన్​లైన్​ గేమింగ్​ సిండికేట్​ బద్దలు

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్​ జీఎస్​టీ ఇంటెలిజెన్స్​ విభాగం అధికారులు మరో భారీ ఆన్​లైన్​ గేమింగ్​ సిండికేట్​ను బద్దలుకొట్టారు. ఈ మేరకు డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ జీఎస్​టీ ఇంటెలిజెన్స్​(Hyderabad DGGI) గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అనుమతిలేని ఆన్​లైన్​ గేమింగ్​ సైట్లను నిర్వహిస్తున్న రూ.13వేల కోట్ల విలువైన ఒక సిండికేట్​ను గుర్తించినట్లు తెలిపింది. ఈ సిండికేట్​ నెట్​వర్క్​కు ఆర్థిక కార్యకలాపాల విషయంలో కొన్ని ఫిన్​టెక్​ కంపెనీలు సహరించినట్లు వెల్లడించింది.

వీటిపైనా చర్యలు తీసుకున్నట్లు డీజీజీఐ (Hyderabad DGGI) తెలిపింది. దీనికి సంబంధించి బ్యాంక్ ఖాతాల్లోని సుమారు రూ.100 కోట్లను ఫ్రీజ్​ చేసినట్లు చెప్పింది. అలాగే సిండికేట్​లోని కొంతమందిని ఈ నెలలోనే అరెస్ట్​ చేశామని పేర్కొంది. ప్రస్తుతం ఆన్​లైన్​ గేమింగ్​ విచారణలో భాగంగా ఓ ప్రైవేట్​ కంపెనీ ఫౌండర్​, డైరెక్టర్​ అయిన పంకజ్​ కుమార్​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేసినట్లు తెలిపింది.

Read Also: ఫ్లయింగ్ కిస్ ఇస్తే జైలుకే.. ముంబై కోర్టు సంచలన తీర్పు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>