తమిళనాట కీలక మలుపు.. డీఎంకే కూటమిలో చేరిన డీఎండీకే

కలం, డెస్క్ : ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమిళనాట కీలక మలుపు చోటు చేసుకుంది. డీఎంకే (DMK) పార్టీతో డీఎండీకే (DMDK) పొత్తును ప్రకటించింది. తాజాగా సీఎం స్టాలిన్ ను డీఎండీకే అగ్ర నాయకురాలు ప్రేమలతా-విజయకాంత్ కలిశారు. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో డీఎండీకే చేరుతున్నట్టు ప్రేమలతా ప్రకటించారు. త్వరలోనే సీట్ల సర్దుబాటు విషయాలు తెలుపుతామన్నారు. ద్రవిడ పాలనను కొనసాగిస్తూ, తమిళనాడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు. తన భర్త విజయ్ కాంత్ బతికి ఉన్నప్పుడే ఈ పని చేయాల్సిందని.. కార్యకర్తల కోరిక మేరకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు.

సీఎం స్టాలిన్ (MK Stalin) మాట్లాడుతూ.. తమిళనాట డీఎండీకే (DMDK) పాత్ర చాలా గొప్పదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 200 సీట్లకు పైగా సాధించి విజయం సాధించడమే విజయ్ కాంత్ కు నివాళి అన్నారు. డీఎండీకే బాధ్యతలను ప్రేమలతా తీసుకోవడం ఆ పార్టీ ప్రగతిని బలోపేతం చేస్తుందని చెప్పారు. డీఎండీకే సరైన నిర్ణయం తీసుకుందని.. ద్రవిడ పాలన తమిళనాడులో కొనసాగుతుందని సీఎం స్టాలిన్ చెప్పుకొచ్చారు.

Read Also: ఫ్లయింగ్ కిస్ ఇస్తే జైలుకే.. ముంబై కోర్టు సంచలన తీర్పు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>