హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ జోసెఫ్!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ యూట్యూబర్ జోసెఫ్ (YouTuber Joseph) అలియాస్ ప్రశ్న రావణ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన అన్ని కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే పాయకరావుపేట, పిఠాపురం, మచిలీపట్నం, సర్పవరం పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లను (SHO) కూడా ప్రతివాదుల జాబితాలో పేర్కొన్నారు. యూట్యూబర్ జోసెఫ్ (YouTuber Joseph) దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు రేపు విచారణ జరపనుంది.

Read Also: టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 తప్పులు చేస్తే ప్రమాదమే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>