కలెక్టర్ ఆధ్వర్యంలో జనగణన ప్రాక్టికల్ డెమో..

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) జనగణన(Census)  ప్రక్రియపై శుక్రవారం ప్రాక్టికల్ డెమో (Practical Demo)  నిర్వహించారు. జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో క్షేత్రస్థాయి సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. మూడు రోజుల శిక్షణ అనంతరం, సిబ్బంది పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో పాలకోయ తండాలోని ఓ ఇంటిని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, ఆస్తుల వివరాలను సిబ్బంది ఎలా సేకరిస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణనలో సేకరించే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి అంశాన్ని శ్రద్ధగా నమోదు చేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి అవసరమైన సమాచారం అందిస్తూ డేటా సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, 2026-27 జనగణన ప్రక్రియ అధికారికంగా ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమైంది. కోవిడ్-19 కారణంగా ఆలస్యమైన ఈ 16వ జనగణనను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు.

మొదటి దశలో ఇళ్ల గుర్తింపు, వాటిలోని సౌకర్యాలు, ఆస్తుల వివరాల సేకరణ చేపడతారు. ఇది ఏప్రిల్ 2026 నుంచి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగనుండగా, తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు అమలు చేస్తారు. రెండో దశలో వ్యక్తుల పూర్తి వివరాలు, విద్య, ఉపాధి, ఇతర సామాజిక అంశాలను సేకరిస్తారు. ఈ దశ తెలంగాణలో 2027లో ప్రారంభం కానుంది. 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేసి, కొత్త జనాభా లెక్కలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>