Mobile Popup Ad
Mobile Popup Ad

రియల్ మాడ్రిడ్‌లో ముసలం.. కోచ్ మారే అవకాశం?

కలం, వెబ్ డెస్క్:  ఆదివారం రాత్రి జరిగిన పోరులో బార్సిలోనా చేతిలో చిత్తుగా ఓడిపోయిన రియల్ మాడ్రిడ్ (Madrid), లా లిగా టైటిల్‌ను ప్రత్యర్థికి కోల్పోయింది. బార్సిలోనా తన 29వ లీగ్ కప్‌ను ముద్దాడగా.. రియల్ మాడ్రిడ్‌లో మాత్రం ముసలం పుట్టింది. టీమ్ పరిస్థితిని చక్కదిద్దేందుకు మాజీ బాస్ జోస్ మౌరిన్హోను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గత ఛాంపియన్స్ లీగ్ గెలిచినప్పటి నుండి జట్టులో క్రమశిక్షణ తప్పింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి. గొడవలు ప్రాక్టీస్ గ్రౌండ్ నుండి ఆసుపత్రి వరకు వెళ్లాయి. మొన్నటి గొడవలో సీనియర్ ప్లేయర్ వాల్వెర్డె స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణకు కారణమైన ఆటగాళ్లపై క్లబ్ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్టార్ ప్లేయర్ ఎంబాప్పే విహారయాత్రలకు వెళ్లడంపై యాజమాన్యం సీరియస్‌గా ఉంది. ప్రాక్టీస్ సమయంలో అసిస్టెంట్ కోచ్‌ను అవమానించాడనే ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. కోచ్ అల్వారో అర్బెలోవా మాట కూడా ఆటగాళ్లు వినడం లేదనేది బహిరంగ రహస్యం. వరుసగా రెండేళ్లు ఒక్క మేజర్ ట్రోఫీ కూడా లేకపోవడంతో ప్రెసిడెంట్ పెరెజ్ అసహనంగా ఉన్నారు. అలోన్సో, అర్బెలోవా వంటి కోచ్‌లు విఫలం కావడంతో, కఠినంగా వ్యవహరించే మౌరిన్హోను తేవాలని ఆయన భావిస్తున్నారు. బెన్ఫికా క్లబ్‌కు రిలీజ్ ఫీజు కట్టి మరీ మౌరిన్హోను తెచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ ‘స్పెషల్ వన్’ అయినా మాడ్రిడ్‌ను (Madrid) మళ్ళీ గెలిపిస్తాడో లేదో వేచి చూడాలి.

Read Also: బీజేపీ బహిరంగ సభ సక్సెస్.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>