హైదరాబాద్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు.. స్వీకరించిన పొన్నం

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డుల (Swachh Survekshan 2025-26 National Award) ప్రదానోత్సవంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా స్వచ్ఛ సర్వేక్షణ్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అవార్డును స్వీకరించారు. 2025-26లో తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా గుర్తింపు పొందిన సందర్భంగా ఈ అవార్డును బహూకరించారు.

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించింది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రతవంటి ప్రధాన అంశాల ప్రాతిపదికన జీహెచ్‌ఎంసీ ఈ అవార్డు గెలుచుకుంది.

జీహెచ్‌ఎంసీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు వరించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ అధికారులను సీఎం అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా, నెట్‌జీరో సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వివిధ ప్రమాణాల ఆధారంగా హైదరాబాద్‌కు ఈ గుర్తింపు లభించడం గర్వకారణమని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>