కొండగట్టులో చెక్క విగ్రహంతో అంజన్న దర్శనం

కలం, కొండగట్టు: కొండగట్టు (Kondagattu)లో అంజన్న దర్శనానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. గర్భాలయంలో ఉన్న మూలవిరాట్‌పై చందనం తొలగించే సమయంలో వాహన పూజలు మినహా అన్ని ఆర్జిత సేవలను 5 రోజుల పాటు నిలిపివేయనున్నారు. ఆ సమయంలో స్వామివారి దైవ దర్శనం కూడా నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు స్వామి వారి దర్శనార్థం ఆలయ ప్రాంగణంలో చెక్కతో తయారు చేయించిన ఉత్సవమూర్తిని ప్రతిష్టించి దర్శనం కల్పించనున్నారు. ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>