బండి భగీరథ్‌ పోక్సో కేసు.. సిట్ కీలక అడుగు

కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సిట్ (SIT) కీలక నిర్ణయం తీసుకుంది. పోక్సో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భగీరథ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు రావాలని, విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. సిట్ నిర్ణయంతో మరోసారి పోక్సో కేసుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో రేపటి సిట్ విచారణపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Read Also:  నా కొడుకు నిప్పు… నిందలు వేసినవాళ్ళను వదిలిపెట్టను: బండి సంజయ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>