హైడ్రాపై హైకోర్టు సీరియస్.. రంగనాథ్‌కు నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ‘వాణి కో-ఆపరేటివ్’ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి సూచనలు లేకుండానే కూల్చివేత చేపట్టినట్లు కోర్టు దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని హైకోర్టు సీరియస్‌గా పరిగణించినట్లు తెలుస్తోంది. కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. కూల్చివేతకు దారితీసిన పరిస్థితులు, అధికారుల చర్యలు తదితర అంశాలపై వివరాలు అందజేయాలని కోర్టు సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>