epaper
Monday, March 2, 2026
epaper

మా అభ్యర్థుల్ని గెలిపిస్తే… రూ. 10 లక్షల నజరానా : బండి సంజయ్

కలం డెస్క్ : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు ఖరారు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలు మొదలయ్యాయి. బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరుగుతున్నందున తమ పార్టీ బలపరిచే సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపిస్తే రూ. 10 లక్షల వరకు ‘ప్రోత్సాహక నిధులు’ ఇస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ప్రకటించారు. గ్రామ పంచాయతీ ప్రజలంతా ఒక్క మాట మీదనే నిలబడి వారి గ్రామాల అభివృద్ధి వైపు ద్రుష్టి సారించాలని కోరారు.

ఆ అభివృద్ధి కోసమే తాను ‘ప్రోత్సాహక నిధులు’ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ఒక్కో గ్రామ పంచాయతీకి ఏకగ్రీవం చేసినందుకు రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేసిందని, ఆ పార్టీ మాటలు నమ్మి దాదాపు 70 గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవం చేసుకున్నారని, కానీ తాము మాత్రం తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, రాష్ట్ర సర్కారు దగ్గర నిధులు లేవన్నారు. ఒక్కసారి పొరపాటు చేస్తే ఐదేండ్లు నరక యాతన తప్పదని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Read Also: టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా.. బీజేపీకి దీదీ వార్నింగ్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!