కలం, నిర్మల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం భైంసా పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కేజీబీవీ విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలునాటి సంరక్షించడం ద్వారా భావితరాలను ఆరోగ్యకరమైన వాతావరణం అందించే అవకాశం ఉందని, మొక్కలు నాటి సంరక్షించడం అందరి బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ఎస్పీ ముచ్చటిస్తూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. వారికి చాక్లెట్లు, అరటిపండ్లు పంపిణీ చేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సీఐలు ప్రవీణ్ కుమార్, రవీంద్ర నాయక్, ఎస్సైలు పాల్గొన్నారు.
Read Also: ప్రశ్నార్థకంగా స్వర్ణ ఆశ్రమ బాలికల భద్రత!
Follow Us On : WhatsApp

