కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మానవత్వం చాటుకున్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదే సమయంలో హైదరాబాద్ వెళ్తున్న బండి సంజయ్ వెంటనే స్పందించి కారు దిగి, క్షతగాత్రుల వద్దకు వచ్చారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడినట్లు తెలుసుకుని వెంటనే తన పోలీస్ పైలట్ వాహనంలో కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం, అక్కడ కాసేపు ఉండి ప్రమాదం ఎలా జరిగిందని వాకబు చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ, ప్రమాదం జరగగానే వెంటనే స్పందించిన తీరు చూసి అక్కడున్నవారు ప్రశంసించారు.
Read Also: మోదీతో భేటీ.. భారత్ కు ట్రంప్ శుభవార్త
Follow Us On : WhatsApp

