కలం, వెబ్ డెస్క్ : ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో (Modi-Trump) భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశంలో ఇరు దేశాధినేతలు పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత పరిస్థితులు, వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి, అమెరికా నుంచి ఇంధన దిగుమతులు, ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే భారత్ కు ట్రంప్ శుభవార్తను అందించారు.
భారత్, అమెరికా మధ్య త్వరలో ట్రేడ్ డీల్ జరగబోతుందని ట్రంప్ తెలిపారు. భారత్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీపై ట్రంప్ (Modi-Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ చూడటానికి వెరీ కూల్ అండ్ కామ్ గా, దేవదూతలా కనిపిస్తాడని.. కానీ ఇతను చాలా కఠినమైనవాడు అని తెలిపారు. ఇలాంటి వాళ్లు కొద్ది మందే ఉంటారని ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. అయితే హర్మూజ్ దగ్గర ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని.. స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని కోరారు. హర్మూజ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. హర్మూజ్ దగ్గర భారత నావికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Also: మనమే ఫేమస్ కపుల్.. మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సంభాషణ
Follow Us On: X(Twitter)

