Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్, కేటీఆర్ మధ్య రహస్య ఒప్పందం

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విచారణ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయకుండా బంతిని కేంద్రం కోర్టులోకి వేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. బీజేపీ భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలని చూస్తే తాము అంత అమాయకులం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసిందని.. వాటిని ఎందుకు నిరూపించలేకపోయిందని ప్రశ్నించారు.

డ్రగ్స్ కేసు ఎందుకు నీరు గార్చారు?

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపించగానే రేవంత్ రెడ్డి స్పందిస్తూ పదేండ్లు మీరు దోచుకోలేదా? అని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. పదేండ్లు మీరు దోచుకున్నారు… రెండేండ్లు మేము దోచుకున్నాం అన్న ధోరణిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కేటీఆర్‌కు మధ్య ఒప్పందం కుదిరిందని అందుకే డ్రగ్స్ కేసు నీరు గార్చారని పేర్కొన్నారు.

అకున్ సబర్వాల్ నివేదిక ఏమైంది?

గతంలో ఐఏఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఇచ్చిన నివేదికను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మొదటి నుంచి చెబుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరకు ప్రాజెక్టు మొత్తం అవినీతి జరగలేదని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లోనే అవినీతి జరిగిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ.. డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని పేర్కొన్నారు. కవితను, కేటీఆర్‌ను కలపడానికి రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. హరీశ్ రావును రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని బండి (Bandi Sanjay) ఆరోపించారు.

Read Also: డబ్బులు ఇవ్వండి.. ‘ధురంధర్’ మేకర్స్‌కు పాక్ ప్రజల వింత డిమాండ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>