డబ్బులు ఇవ్వండి.. ‘ధురంధర్’ మేకర్స్‌కు పాక్ ప్రజల వింత డిమాండ్

కలం, వెబ్ డెస్క్ : ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ‘‘ధురంధర్ 2 ” (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సుమారు 4 గంటల నిడివి ఉన్న ‘A’ రేటెడ్ సినిమా కేవలం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లతో  పది రోజుల్లోనే రూ.1226+ కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా సక్సెస్ వెనుక మా ప్రాంత ప్రమేయం ఉందని పాకిస్థాన్ లోని ల్యారీ ప్రజలు అంటున్నారు. తమ ప్రాంతం పేరును వాడుకున్నందుకు వసూళ్లలో వాటా ఇవ్వాలని కోరుతున్నారు. కొందరైతే ఏకంగా ల్యారీ గ్రామ అభివృద్ధికి 80 శాతం నిధులను చిత్ర యూనిట్ కేటాయించాలని సూచిస్తున్నారు.

కాగా, ధురంధర్ సినిమా మొత్తం కరాచీలోని ల్యారీ ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. భారత గూఢచారి అయిన హీరో ల్యారీ ప్రాంతంలో వరల్డ్ మాఫియా లో చేరి ఏం చేశాడు? అనే స్టోరీతో ఈ మూవీ రెండు పార్ట్ లుగా  వచ్చింది. ఈ క్రమంలోనే ధురంధర్ -1 ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు వసూలు చేస్తే, ఇప్పుడు ధురంధర్-2 ఈ రికార్డును దాటి వసూళ్లను సాధిస్తోంది. అటు నార్త్ అమెరికాలో 9 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ‘బాహుబలి 2’ రికార్డును ‘‘ధురంధర్ 2 (Dhurandhar 2) ” బద్దలుకొట్టింది. 2017 ఏప్రిల్‌లో విడుదలైన ”బాహుబలి 2”.. నార్త్ అమెరికాలో 20+ మిలియన్‌ డాలర్లు వసూలు చేసి, అక్కడ హయ్యెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. గత తొమ్మిదేళ్లుగా ఈ రికార్డును ఏ సినిమా అధిగమించలేకపోయింది. ఇప్పుడు ‘’ధురంధర్‌ 2 ‘’ మూవీ కేవలం 10 రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్‌ చేసింది. 10 రోజుల్లో $34.25 మిలియన్లు వసూలు చేసింది. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.325 కోట్లు ఉంటుంది.

Read Also: హనుమంతుడి విగ్రహానికి నమస్కరించిన వానరం

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>