షాకింగ్.. బాలుడి చెంప పగులగొట్టిన రోబో, వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో రోబోల (Robot) వాడకం సర్వసాధరణమైంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల రోబోలు సాంకేతిక లోపాలు లేదా ప్రోగ్రామింగ్ వైఫల్యాల వల్ల ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హోటళ్లు, ఆస్పత్రులు, డెలివరీ సర్వీసుల్లో వినియోగిస్తున్న ఈ యంత్రాలు ఒక్కోసారి మనుషుల ఆదేశాలను పాటించలేకపోతున్నాయి. సడన్‌గా ఆగిపోవడం లేదా తప్పుడు సమాచారాన్ని అందించడం వంటి ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని సందర్భాల్లో ఇవి సామాన్యుల పనులకు ఆటంకం కలిగిస్తూ భద్రతాపరమైన ఆందోళనలను కూడా రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రోబో బాలుడి చెంప పగులగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చైనాలో (China) ఓ చోట ప్రదర్శన జరుగుతోంది. ఆ సమయంలో పొరపాటున హ్యూమనాయిడ్ రోబో ఓ బాలుడి చెంప పగలగొట్టింది. రోడ్డుపై ప్రదర్శన ఇస్తున్న క్రమంలో డ్యాన్స్ చేస్తుండగా.. బారికేడ్ల అవతల ఉన్నచిన్నారికి బలంగా రోబో చేయి తాకింది. దీంతో ఆ చిన్నారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా రియాక్ట్ అయ్యారు. రోబోతో బీ కేర్ ఫుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>