తల్లిదండ్రుల రక్షణ కోసమే వయోవృద్ధుల కమిషన్ : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: సమాజంలో తల్లిదండ్రులను గౌరవించడం, వారిని సంరక్షించుకోవడం ఒక సామాజిక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో వయోవృద్ధుల కమిషన్‌ను ప్రవేశపెట్టగా, శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వయోవృద్ధుల కమిషన్‌ (Senior Citizens Commission) గురించి మాట్లాడారు. ఈ కమిషన్ ఎందుకు అవసరం? చట్టం ఎందుకు చేయాల్సి వస్తోంది? అనే విషయాలను రేవంత్ రెడ్డి వివరించారు. ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధిస్తూ, ఘర్షణలు పడుతూ పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్న ఘటనలు పెరిగిపోవడం దురదృష్టకరమన్నారు. కన్నవారిని నిర్లక్ష్యం చేసే వారిని నియంత్రించడానికి చట్టపరమైన చర్యలు అవసరమని భావిస్తూ, రాష్ట్రంలో వయోవృద్ధుల కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వృద్ధాప్యంలో కష్టం చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు ఈ చట్టం ఒక భరోసాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోని పక్షంలో పిల్లల నుంచి నెలకు రూ. 10 వేల వరకు పరిహారం ఇప్పించేలా నిబంధనలు తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పరిమితులకు లోబడి ఈ పదివేల రూపాయల ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. వృద్ధులకు కనీస గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read Also: పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై ప్రధాని మోదీ ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>