Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాహువు అయితే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కేతువు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించారని, కానీ సీఎం అయిన తర్వాత కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై మాత్రమే విచారణ కోరడం అనుమానాస్పదమని బండి సంజయ్ అన్నారు. పూర్తిస్థాయి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకే పరిమిత విచారణ కోరుతున్నారు. దమ్ముంటే మొత్తం కాళేశ్వరం అవినీతిపై విచారణకు లేఖ రాయాలని సవాల్ విసిరారు. మోటార్ల కొనుగోళ్లలో కూడా భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కరీంనగర్‌లో రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కేంద్రం అమృత్  2 పథకం కింద చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. రేకుర్తి చెరువును మినీ టూరిస్ట్ స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్‌లో రోడ్ల అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. బీజేపీ–బీఆర్‌ఎస్ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ స్థానం కోసం రేవంత్ రెడ్డి తాపత్రయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్థానాన్ని ఆక్రమించాలని తాపత్రయపడుతున్నారని బండి సంజయ్  ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని, కానీ అసలు ఉద్దేశం రాజకీయ ప్రయోజనాలేనని బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించడం లేదని, అందుకే ఆ స్థానానికి చేరాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను అడ్డుకోవడం విపక్షాల పెద్ద తప్పిదమని ఆయన అన్నారు. మహిళల ప్రాతినిధ్యం విషయంలో కుటుంబ పార్టీలే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాయని ఆరోపించారు. దేశ జనాభా పెరిగిన నేపథ్యంలో పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచాలని ప్రతిపాదించగా, విపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు.

Read Also: ‘ప్రధాని మోదీని నేను అలా అనలేదు’.. ఖర్గే ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>