రీల్స్ పిచ్చితో ప్రాణం తీసుకున్నాడు!

కలం, వెబ్ డెస్క్: రీల్స్ పిచ్చిలో (Dangerous Reel Trend) పడి ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు అనేకం కనిపిస్తున్నా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా, హైదరాబాద్ నాచారంలో అలాంటి దారుణం చోటు చేసుకుంది. మల్లాపూర్‌‌ బస్తీలో ఉంటున్న మితున్ (14) అనే బాలుడు నిత్యం రీల్స్ లో ప్రమాదకర స్టంట్స్ చూస్తుంటాడు. తన స్నేహితుల్లో కొందరు అలాగే చేస్తుండటంతో, తాను కూడా త్వరగా ఫేమస్ అవ్వాలని భావించాడు. అనుకున్నదే తడువుగా.. తన ఇంటి బాల్కనీ గోడపైకి ఎక్కడి విన్యాసాలు చేస్తుండగా.. పట్టు తప్పి కిందపడిపోయి, అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా, నెట్టింట వైరలవుతున్నాయి. బిహార్ నుంచి మితున్ తల్లిదండ్రులు వలస వచ్చి, స్థానికంగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

వేసవి సెలవులు.. అప్రమత్తం కావాల్సిందే!

ఒకప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే.. పిల్లలు రోజంతా ఆటల్లో మునిగిపోయేవారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత.. ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా, ఇన్ స్టా, యూ ట్యూబ్ వంటి వాటిలో రీల్స్ చూసుకుంటూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఇదే క్రమంలో.. కొందరు పిల్లలు ప్రమాదకర స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలపై కన్నేసి ఉంచాలని.. వారు ఏం చేస్తున్నారో గమనించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read Also: జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌కు‌ ప్రయోజనం ఎంత?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>