బాలయ్య, కొరటాల సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ?

కలం, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘NBK 112’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సేన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు మేకర్స్ ‘కార్పెంటర్'(Carpenter) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతుంది. కొరటాల స్టైల్ ఆఫ్ మాస్ యాక్షన్ డ్రామాగా, పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందించబడనుంది. అయితే  ఈ  సినిమా పూజా కార్యక్రమం మే 21న జరగనుందని సమాచారం. ఇప్పటికే స్టార్ హీరోలకు వరుస మాస్ సినిమాలతో సూపర్ హిట్స్ అందించిన కొరటాల బాలయ్యను (Balakrishna) ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది.

Read Also: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ AI లుక్.. ఫ్యాన్స్‌కు పూనకాలు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>