తిరుమలయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: తిరుమలయ్య గుట్ట (Tirumalayya Gutta) ను ఆధ్యాత్మిక క్షేత్రంతో పాటు సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Tudi Megha Reddy) తెలిపారు. ఈ నిధులతో కొండకు మెరుగైన రహదారి, తాగునీటి సౌకర్యం, హరిత హోటల్ నిర్మాణం, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు వసతులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా తిరుమలయ్య గుట్టను సందర్శించిన ఎమ్మెల్యే మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పరిసరాలు, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలయ్య గుట్టకు ఆధ్యాత్మికంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, భక్తులతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

నిధులను సద్వినియోగం చేసుకుని కుటుంబ సమేతంగా సందర్శించే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రతి నెల 7వ తేదీన వనపర్తి ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారని, అదే విధంగా స్థానికంగా ఉన్న తిరుమలయ్య గుట్ట వేంకటేశ్వర స్వామివారిని కూడా భక్తులు సందర్శించాలని కోరారు. ప్రతి నెల 7వ తేదీన స్థానిక భక్తులు గుట్టకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరె రాములు, మండల అధ్యక్షుడు రవి యాదవ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>