కలం, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న లీకులు, AI జనరేటెడ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ లుక్‌తో అభిమానుల్లోనూ అంచనాలు రెట్టింపయ్యాయి.
మే 20న తారక్ (NTR) పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ AI ఫోటోను మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఫొటో ఏ సినిమాకు సంబంధించిందో తెలియాల్సి ఉంది.
Read Also: బరువు తగ్గేందుకు మందులను వాడుతున్నారా? బీ అలర్ట్
Follow Us On: WhatsApp

