కొమురం భీమ్‌కు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నివాళులు

కలం, ఉట్నూరు: ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ (Komaram Bheem) వర్ధంతిని పురస్కరించుకుని ఉట్నూరు మండలం దొంగిచింత గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Bojju Patel) పాల్గొన్నారు. కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో పాల్గొని ఆదివాసీ సంప్రదాయ నృత్యం చేస్తూ సందడి చేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>