ట్రాఫిక్‌ నుంచి విముక్తికి త్రీ లెవెల్ ప్లాన్: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్‌ డెస్క్‌ : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర భవిష్యత్తుపై కీలక విధానాలను రూపొందించారు. ఆధునీకరణ, పట్టణీకరణ వల్ల రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.

హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. కేవలం రోడ్ల విస్తరణతోనే సమస్య పరిష్కారం కాదని, మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ద్వారా ప్రయాణాలను సులభతరం చేస్తామన్నారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి నగరవ్యాప్తంగా మల్టీ లెవెల్ పార్కింగ్ (Multi Level Parking) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు విభాగాల వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న క్యూర్ ఏరియాను సర్వీస్ సెక్టార్‌గా, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్యూర్ ఏరియాను మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌గా, రీజనల్ రింగ్ రోడ్డు అవతల ఉన్న రేర్ ప్రాంతాన్ని అగ్రికల్చర్ సెక్టార్‌గా తీర్చిదిద్దుతారు.

తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ద్వారా రాష్ట్ర సమగ్ర వికాసానికి బాటలు వేస్తున్నట్లు సీఎం (Revanth Reddy) ప్రకటించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును మన సంస్కృతికి అద్దం పట్టేలా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చబోతున్నట్లు వెల్లడించారు.

Read Also: తిడితే పెట్టుబడులు వస్తాయా..? సీఎంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>