కలం, వెబ్ డెస్క్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య (VC Aldas Janaiah)పై ఒక మహిళా ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీసీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగతంగా మానసిక ఇబ్బందులకు గురిచేశారని ఆమె మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
తనతో ఏకాంతంగా గడపాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, భర్తను వదిలేస్తే తీసుకెళ్తానని ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించారు. 20 ఏళ్ల క్రితం పుట్టి ఉంటే పెళ్లి చేసుకునేవాడినంటూ అనుచితంగా మాట్లాడారని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, స్వతంత్ర కమిటీతో నిష్పక్షపాత విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

