Mobile Popup Ad
Mobile Popup Ad

బక్రీద్ పండుగ వేళ నవీ‌పేట్ సంత కళ కళ

కలం, నిజామాబాద్ బ్యూరో: ఈ నెల 27న బక్రీద్ (Bakrid) పండుగను పురస్కరించుకుని ఆదివారం నిజామాబాద్ జిల్లా నవీ‌పేట్ మేకల సంతలో జీవాల అమ్మకాలు భారీగా జరిగాయి. వ్యాపారులు, కొనుగోలుదారులతో అంగడి స్థలం కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు 8 వేలకు పైగా మేకలు, గొర్రెలను తీసుకొచ్చి అమ్మారు. 10 కిలోల పొట్టేలు ధర రూ.13 వేల నుంచి రూ.15వేలు పలికింది. నిజామాబాద్, కామారెడ్డి, మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు, జనాలు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి మేకలు గొర్రెలను కొనుగోలు చేసుకొని వెళ్లారు.

రాష్ట్రంలోనే అతి పెద్ద మేకల మార్కెట్..

తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద మేకల అంగడి నవీపేట్‌లో జరుగుతుంది. ఇక్కడి సంతలో బక్రీద్ (Bakrid) కోసం ఒక్కరోజే సుమారు రూ. 6 కోట్లకు పైగా జీవాల విక్రయాలు జరిగాయి. దసరా సమయంలో కూడా రూ.కోట్ల వ్యాపారం అవుతుంది. నవీ‌పేట్ ఇటు నిజామాబాద్, నిర్మల్, బాసర ప్రాంతాల నడుమ ఉండటం, పొరుగునే మహారాష్ట్ర ఉండటంతో వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుంటుంది. ప్రతి వారం పెద్ద ఎత్తున వ్యాపారం అవడంతో పాటు ప్రత్యేక రోజుల్లో పండుగలు గ్రామ పండుగల సమయాల్లో భారీగా మేకలు గొర్రెల అమ్మకాలు సాగుతాయి.. ఆటోలు ట్రాలీ ఆటోలు బైక్ లు భారీ వాహనాల్లో సైతం వచ్చి ఎక్కువ సంఖ్యలో ఇక్కడి నుంచి మేకలు గొర్రెలు తీసుకెళ్తుందటం విశేషం.

Read Also: అవ‌కాశం వ‌స్తే ఆయ‌న ప‌క్క‌న హీరోయిన్‌గా చేస్తా: రోజా

Read Also: ఆమెకు రక్షణేది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>