కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లా అగ్ని గుండంలా (Warangal Heatwave) మారింది. జిల్లాలో ఎండలు, వడగాలుల బీభత్సం నెలకొంది. ఈ నేపథ్యంలో జనం ఎండ వేడి, వడ గాలుల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. బాధితులను చికిత్స కోసం అస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
నిప్పుల కొలిమిలా జిల్లా
వరంగల్ జిల్లా ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారింది. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌లో 43 నుంచి 43 డిగ్రీ ల వరకు టెంపరేచర్ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో మే 27 వరకు హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భీకరమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న వడదెబ్బ మరణాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు వడదెబ్బ (Warangal Heatwave) మరణాలు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 20 మంది మరణించగా ఈ నెలలో ఇప్పటి వరకు 40 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. ఎక్కువగా పొలం పనులకు వెళ్లిన కూలీలు, రోడ్డు మీద తిరిగే ఆటో డ్రైవర్లు, వృద్ధులు వడదెబ్బకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచనలు చేస్తోంది.
Read Also: కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

