కలం, నిర్మల్ : సారంగాపూర్ మండలం ధని (Dhani) గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ జెట్టవేని బడి పోతన్న, వార్డు సభ్యులు, గ్రామస్తులు బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ (Dhani Sarpanch) మాట్లాడుతూ.. గ్రామంలోని గాంధీ విగ్రహం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామపంచాయతీ తీర్మానం చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు వ్యక్తిగత కక్షతో పనులను అడ్డుకోవడంతో పాటు అధికారులకు ఫిర్యాదులు చేస్తూ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామాభివృద్ధి రాజకీయాలకు అతీతంగా సాగాలని, జిల్లా అధికారులు గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలగించి సీసీ రోడ్డు నిర్మాణం నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.
Read Also: ఎంజేపీ పాఠశాలలో ఎమ్మెల్యే ఏలేటి క్షేత్రస్థాయి పరిశీలన
Follow Us On: Instagram

