మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్​

కలం, వెబ్​ డెస్క్​ : వైఎస్సార్సీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) ను పోలీసులు అరెస్ట్​ చేశారు. హిట్ అండ్ రన్ కేసు నుంచి తన కొడుకుని తప్పించేందుకు సీదిరి అప్పలరాజు పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో సీదిరి కుమారుడు నిందితుడిగా ఉండగా, అతడిని కేసు నుంచి తప్పించేందుకు సాక్ష్యాధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రిపై కూడా కేసు నమోదైంది. అప్పలరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు కాశీబుగ్గ పోలీస్​ స్టేషన్​ కు తరలించారు. అరెస్టు సమయంలో సీదిరి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అప్పలరాజు కొడుకు అరవ్​ వర్మ బైక్​ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో సీదిరి అప్పలరాజు కుమారుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. హిట్​ అండ్​ రన్​ కేసులో పోలీసులు సీదిరి అప్పలరాజును ఏ3 గా చేర్చారు.

ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన సోంపేట కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సీదిరి అప్పలరాజును అరెస్ట్​ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>