కలం, వెబ్ డెస్క్: మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 93 సార్లు పేపర్ లీక్ (Paper Leak) ఘటనలు జరిగాయని ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. “బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోనే ఎక్కువగా పేపర్ లీకులు అవుతున్నాయి. ఫలితంగా 6 కోట్ల మంది యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఏమాత్రం యాదృచ్ఛికం కాదు” అని స్పష్టం చేశారు.
‘మంత్రులను జైళ్లకు పంపించలేమా..?’
ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీక్ ఘటన మరిన్ని అనుమానాలకు తావిస్తోందని కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. “దీని వెనుక.. బీజేపీ నేతల ప్రమేయం ఉందనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ ఉంటే, సీబీఐ ఏం చేయబోతుంది. ఈ పేపర్ లీక్ ఘటనలు ఇలాగే జరగాలని కోరుకుంటున్నారా.. అని జెన్–జీ యువతను అడగాలనుకుంటున్నా. నేపాల్, బంగ్లాదేశ్ ల్లో జెన్–జీ యువత రోడ్ల మీదకు ప్రభుత్వాలనే మార్చేశారు. మన దగ్గర యువత అలా చేస్తే.. మంత్రులను జైళ్లకు పంపించలేమా.. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది” అని పేర్కొన్నారు.
Read Also: పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధర
Follow Us On: Pinterest

