Mobile Popup Ad
Mobile Popup Ad

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధర

కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు (Gold – Silver Prices) భారీగా పెరుగుతూ ఆకాశాన్నంటున్నాయి. ఓ వైపు ఎండాకాలం భానుడు చుక్కలు చూపిస్తుంటే.. బంగారం ధరలు అంతకంతకు పెరిగి అందని ద్రాక్షలా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, బులియన్ మార్కెట్ వర్గాలలో పరిస్థితుల నేపథ్యంలో పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంలో బంగారం కొనాలనుకువారు షాక్ కు గురవుతున్నారు. వధువుకు కట్నంగా పెట్టే పేదింటి తల్లిదండ్రులు సైతం పుత్తడి ధరలు పెరగటంతో అయోమయ స్థితిలో ఉన్నారు. పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో కేంద్ర ప్రభుత్వం విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. ఈ ఎఫెక్ట్ బంగారం, వెండిపై పడింది. దీంతో మే 13, 2026న ఒక్కరోజే బంగారం ధరలు, వెండి రేట్లు రికార్డు స్థాయిలో పెరిగాయి.

బులియన్ మార్కెట్ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,53,980 ఉండగా రూ.8,020 పెరిగి రూ.1,62,000గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,150 ఉండగా రూ.7,350 పెరిగి రూ.1,48,500 గా నమోదయింది. ఇక వెండి ధర విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,90,000 ఉండగా ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,10,000 గా ఉంది. తెలంగాణ, ఏపీలో దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

Read Also: శుభకార్యాలకు బ్రేక్‌.. మళ్లీ ముహూర్తాలు ఎప్పుడంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>