మ‌ళ్లీ హైకోర్ట్‌కు ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్.. ఎందుకంటే?

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలో జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్ (Arava Sridhar) వ్య‌వ‌హారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవ‌ల అర‌వ శ్రీధ‌ర్ బాధితురాలు హ‌ర్ష‌వీణ రైల్వేకోడూరులోని టీడీపీ ఆఫీసులో మ‌రోసారి త‌న స‌మ‌స్య‌పై ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. అనంతరం జ‌న‌సేన నేత తాతంశెట్టి నాగేంద్ర ఆమెపై దాడికి పాల్ప‌డ‌టం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తాజాగా అర‌వ శ్రీధ‌ర్ ఏపీ హైకోర్ట్‌ను ఆశ్ర‌యించారు. ఇప్ప‌టి వ‌ర‌కు హర్ష‌వీణ శ్రీధ‌ర్‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ ప‌లు వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది. ఇవి విప‌రీతంగా వైర‌ల్ అయ్యాయి. టీవీ చాన‌ళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల‌లో అంత‌టా షేర్ చేశారు.

ఇక స‌ద‌రు వీడియోలను మీడియా, సోషల్ మీడియాలో నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీధ‌ర్‌ హైకోర్టును ఆశ్రయించారు. మ‌రోవైపు అర‌వ శ్రీధ‌ర్ (Arava Sridhar) వ్య‌వ‌హారంపై ఓ క‌మిటీ వేసిన జ‌న‌సేన అధిష్టానం ఆ క‌మిటీ నివేదిక ఆధారంగా ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించింది. నెల‌లు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదని, త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని హ‌ర్షవీణ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

Read Also:  అసైన్డ్ భూములపై సర్కార్ కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖ రిపోర్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>