కలం వెబ్ డెస్క్ : వాళ్లిద్దరూ ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ పెళ్లి (Love Marriage) చేసుకున్నారు. ఇక ప్రశాంతంగా కలిసి జీవిద్దామనుకునే తరుణంలో ఆ యువకుడు పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ తో అంతా తలకిందులైపోయింది. ఒక్క వాట్సాప్ స్టేటస్ మళ్లీ తన ప్రేయసిని తనకు దూరం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు (Eluru) జిల్లాలోని ముసునూరుకు చెందిన సాయిచంద్, సాయిదుర్గ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు ఇంట్లో పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పారు. తమకు పెళ్లి చేయాలని కోరారు.
కానీ, పెద్దలు దీనికి అంగీకరించలేదు. దీంతో రెండు రోజుల క్రితం సాయిచంద్, సాయిదుర్గ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఫోటోలను సాయిచంద్ తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. దీంతో యువతి బంధువులకు పెళ్లి విషయం తెలిసింది. సాయిచంద్ ఉన్నచోటుకు చేరుకొని యువకుడిని చితకబాదారు. అర్ధనగ్నంగా తాళ్లతో స్తంభానికి కట్టేసి కొట్టారు. అనంతరం యువతిని తీసుకొని వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి బంధువులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read Also: హాస్టల్ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా.. ప్రేమ జంట అరెస్ట్
Follow Us On: Sharechat


