కలం, వెబ్ డెస్క్: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తుండగా చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ (APSRTC Driver) నాగరాజు (39)కు ఛాతిలో నొప్పివచ్చింది. బస్సు పక్కకు ఆపి వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే డ్రైవర్ నాగరాజు చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.
ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడంతో ఓ ఆటో డ్రైవర్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే డ్రైవర్ మృతిచెందాడు. డ్రైవర్‌కు గుండెపోటు ( Heart Attack) వచ్చిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును పక్కకు ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.


