భారీ శుభవార్త.. నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో నియామక పత్రాలు

కలం, వెబ్ డెస్క్: నర్సింగ్ ఆఫీసర్ల (Nursing Officers) ఉద్యోగాల భర్తీలో భాగంగా తుది ఫలితాల్లో ప్రతిభ కనబరిచి, ఉద్యోగాలకు ఎంపికైనవారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. మే 12న అంతర్జాతీయ నర్సింగ్ డే పురస్కరించుకుని 2,322 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామకపత్రాలు ఇవ్వబోతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజర్సింహ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వారికి నియామక పత్రాలు అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

‘మెరుగైన వైద్య సేవలు అందించాలి..’

నర్సింగ్ ఆఫీసర్లుగా (Nursing Officers) నియమితులు కాబోతున్నవారికి రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్ల అసోసియేషన్ శుభాకాంక్షలు తెలిపింది. మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ, సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైనవారు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించింది.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>