కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కోసం పోలీసు శాఖ ‘అరైవ్ అలైవ్’ పేరిట పెద్ద ఎత్తున రోడ్డు భద్రత ప్రచారాన్ని నిర్వహిస్తోంది. నిజామాబాద్ (Nizamabad) నగరంతో పాటు పట్టణాలు, మండలాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మీదుగా వెళ్లే కాశ్మీర్ టూ కన్యాకుమారి జాతీయరహదారి 44పై ఉన్న బ్లాక్‌స్పాట్‌లలో రోడ్ సేఫ్టీ అవేర్ నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా పోలీస్ కటౌట్లు (స్లో డౌన్ ట్రాప్‌లు) ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో వాహనదారులు నెమ్మదిగా సాగుతూ ప్రమాదాలను నివారించవచ్చు. తెలంగాణలో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలతో పెద్ద ఎత్తున మరణాలు జరుగుతున్నాయి. డీజీపీ ఆదేశాలతో పోలీసులు రోడ్డు ప్రమాదాలు, మరణాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి రోడ్డు భద్రత ప్రాముఖ్యత తెలిసేలా చేయాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్లాక్‌స్పాట్‌లలో వాహనాలు నెమ్మదిగా ప్రయాణిస్తే ప్రమాదాలు చాలా వరకే తగ్గే అవకాశం ఉంది.
రోడ్డు భద్రతా నియమాలు మన కోసమే: పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ (Nizamabad CP) సాయి చైతన్య మాట్లాడుతూ.. “రోడ్డు ప్రమాదాలను జీరో శాతానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం.. రోడ్డు భద్రతలో మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. బ్లాక్ స్పాట్స్ ఉన్న చోట్ల వాహనాలు అధిక వేగంతో వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి. పోలీస్ కటౌట్లు పెట్టడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. అలాగే డ్రైవర్లకు హెచ్చరికగా ఉపయోగపడుతుంది. కుటంబ పెద్దను రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో ఆ కుటంబంతా రోడ్డున పడుతుంది. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అది మన కోసమే అవుతుంది.” అని అన్నారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On: Sharechat

