Mobile Popup Ad
Mobile Popup Ad

అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

కలం, తెలంగాణ బ్యూరో : అన్ని రకాల సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖలోనూ దీని గురించి కసరత్తు మొదలైంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు అటవీ (Amrabad Tiger Reserve Forest) ప్రాంతంలో ఇప్పుడు వాడుతున్న విధానానికి AI టెక్నాలజీని వినియోగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం పులులకు సంబంధించే కాకుండా వన్యప్రాణులన్నింటి కదలికలను రికార్డు చేసేందుకు ఏఐ టెక్నాలజీని రాష్ట్ర అటవీ శాఖ వాడాలనుకుంటున్నది. ఏయే ప్రాంతాల్లో దీన్ని ఏ విధంగ వాడాలో థర్డ్ పార్టీ ఏజెన్సీ స్టడీ చేసిన తర్వాత స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది. ఇప్పటికే అడవుల్లో వాడుతున్న థర్మల్ కెమెరాల స్థానంలో వైర్‌లెస్ కెమెరాలను అమర్చి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలన్నది అటవీ శాఖ ఆలోచన.

అడవుల్లోని కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్‌కే :

ప్రస్తుతం అడవుల్లో అటవీశాఖ చాలాచోట్ల వన్యప్రాణుల కదలికలను పసిగట్టేందుకు మాన్యువల్ థర్మల్ కెమెరాలను పెట్టింది. కెమెరాలు రికార్డయ్యే వీడియోలను ఇన్-బిల్ట్ పద్ధతిలో చిప్‌లో స్టోర్ చేయడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఆ కెమెరాలన్నింటినీ అమ్రాబాద్ టైగర్ రిజర్వు (Amrabad Tiger Reserve) కార్యాలయంలో నెలకొల్పే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నందున అక్కడే సర్వర్‌లో స్టోర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఎట్టి పరిస్థితుల్లో వీడియో ఫుటేజీ క్లౌడ్‌లో స్టోర్ చేయవద్దని నిర్ణయం తీసుకున్నది. ఇతర దేశాల్లోని సర్వర్‌లలో కూడా స్టోర్ కావద్దని స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నది. ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేసినా వాటి ఫుటేజ్ మొత్తం కమాండ్ సెంటర్‌కే రావాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతంలోని టెర్రయిన్‌ను దృష్టిల పెట్టుకుని సిగ్నల్ సమస్య ఉన్నట్లయితే రేడియో ఫ్రీక్వెన్సీని వినియోగించేందుకు కూడా ఫారెస్టు డిపార్టుమెంటు ఆల్టర్నేట్ ఏర్పాట్లపై దృష్టి సారించింది.

వన్యప్రాణులే కాక అటవీ పరిరక్షణకు ఈ నిర్ణయం :

కేవలం పులులు, వన్యప్రాణుల కదలికలను పసిగట్టడం, వాటి మనుగడ కోసమే కాక వాటిని వేటాడే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై నిఘా వేయడం, అడవుల్లో అగ్రిప్రమాదాలు సహా విధ్వంసాలను పసిగట్టడం లాంటివాటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకోవాలని ఫారెస్టు డిపార్టుమెంటు భావిస్తున్నది. ఎప్పటికప్పుడు ఆ కెమెరాల్లోని వీడియ ఫుటేజీని లైవ్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీక్షించడంతో పాటు అక్కడి సెన్సార్లు వన్యప్రాణుల లేదా వేటగాళ్ల కదలికలను పసిగట్టిన వెంటనే అలారం ఇచ్చే లాంటి వ్యవస్థ గురించీ ఆలోచిస్తున్నది. అడవుల్లోని కెమెరాల ఫుటేజీలో జియో ఫిజికల్ టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉండేలా, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే కెమెరాలను 360 డిగ్రీల కోణంలో ఆపరేట్ చేసేలా ఆలోచిస్తున్నది. సెంటర్‌లో పెద్ద డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్ మీద చూసే ఏర్పాట్లపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Read Also:  ‘నో స్టాక్’.. తెలంగాణలో డీజిల్ బాంబ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>