కలం, వెబ్‌డెస్క్: హెచ్1బీ, హెచ్4 వీసా (H1B H4 Visas) దరఖాస్తుదారులకు పిడుగు లాంటి వార్త. వీళ్లు ఇంటర్వ్యూలకు దాదాపు ఏడాది పాటు ఎదురుచూడాల్సిందే. ఈ ఇంటర్వ్యూల్లో చాలా భాగం వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదా వేశారు. కాగా, ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా వెట్టింగ్ వల్ల ఇప్పటికే ఈ ఇంటర్వ్యూలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వెట్టింగ్ నిబంధనల కారణంగా దరఖాస్తుదారులు, వాళ్ల కుటుంబ సభ్యుల ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, లింక్డిన్ తదితర ఖాతాలు పరిశీలించాల్సి ఉండడంతో ఇంటర్వ్యూలను కాన్సులేట్లు వాయిదా వేశాయి.
వీటిని వచ్చే ఏడాది మార్చిలో జరపనున్నట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ తాజగా వీటిని మరికొన్ని నెలలు పొడిగించినట్లు కాన్సులేట్లు వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా వెల్లడించింది. దీంతో ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి, ప్రయాణాలు బుక్ చేసుకున్నవాళ్లు, హెచ్1బీ రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చినవాళ్లు, అమెరికాలోని తమ పిల్లల దగ్గరికి వెళ్లడానికి సిద్ధమైన హెచ్4 వీసా(H1B, H4 Visas) దరఖాస్తుదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
Read Also: స్టూడెంట్స్‌కు ల్యాప్‌టాప్‌లు.. తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్
Follow Us On: Sharechat


