కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టే స్పీకర్ గడ్డం ప్రసాద్(Gaddam Prasad) చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్(KTR). ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై స్పీకర్ ఇచ్చిన తీర్పు మీద కేటీఆర్ మాట్లాడారు. ‘పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా 8 మంది ఎమ్మెల్యేలకు ముఖం లేకుండా పోయింది. రేవంత్ టీమ్ లో చేరి వాళ్లు ఉన్న పరువు తీసుకున్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే కడియం శ్రీహరి రాజీనామా అంటే పారిపోయారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది. రాహుల్ గాంధీ ఎన్నో గొప్పలు చెబుతుంటారు కానీ తన పార్టీ ఇలా చేస్తే సైలెంట్ గా ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఆయనది డబుల్ గేమ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
Read Also: H1b, H4.. ఏడాది ఎదురుచూడాల్సిందే!
Follow Us On : WhatsApp


