Mobile Popup Ad
Mobile Popup Ad

అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు హెచ్చరిక!

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు పలు ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు కొన్ని ప్రాంతాలలో అకాల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు (Thunderstorms Rain) పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం ( ఏప్రిల్ 7) పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా ఉండాలని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>