కలం, వెబ్డెస్క్: ఇంధన సంరక్షణ, సామర్థ్య పెంపు రంగంలో ఏపీ, తెలంగాణ అదరగొట్టాయి. గ్రూప్–2 కేటగిరీ (Energy Conservation Awards) లో వరుసగా ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించాయి. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా ఏపీ, తెలంగాణ విద్యుత్ అధికారులు అవార్డులు అందుకున్నారు. ఇంధన సంరక్షణకు తీసుకున్న చర్యలు, ఇంధన సామర్థ్యం అభివృద్దికి సృజనాత్మకంగా, విస్తృతంగా, ప్రభావవంతంగా అమలుచేసిన కార్యక్రమాల కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు అద్భుత ప్రగతిని సాధించి వరుసగా టాప్లో నిలిచాయి.
ఈ అవార్డులను(Energy Conservation Awards) ఆంధ్రప్రదేశ్ తరఫున ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎల్.శివశంకర్, తెలంగాణ తరఫున విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, టీజీ రెడ్కో వైఎస్ చైర్మన్, ఎండీ వి.అనీల అందుకున్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ).. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్–2025 పేరుతో ఈ అవార్డులను ఏటా అందజేస్తుంది.
Read Also: విజన్ సరే… ఇంప్లిమెంటేషన్ ఎలా?
Follow Us On: Sharechat


