కలం, వెబ్ డెస్క్: బరువు తగ్గాలనుకునేవారు (Weight Lose) సాధారణంగా మార్నింగ్, నైట్ టైమ్‌లోనే పాటించాల్సిన నియమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు. మధ్యాహ్నం వేళల్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా బరువు పెరగడానికి ముఖ్యమైన కారణాలుగా మారుతుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం (Afternoon) 12 గంటల తర్వాత వచ్చే అలసట, బద్ధకం కారణంగా చాలామంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఆశ్రయిస్తుంటారు. మధ్యాహ్న భోజనాన్ని పూర్తిగా మానేయడం లేదా ఆలస్యంగా తినడం వల్ల రాత్రి వేళల్లో విపరీతంగా ఆకలి వేసి, ఎక్కువ మొత్తంలో క్యాలరీలు తీసుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు, ఆఫీసులు, ఇళ్లలో టీవీలు, కంప్యూటర్ల ముందు కూర్చుని అదేపనిగా స్నాక్స్ తినడం వల్ల తెలియకుండానే ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి చేరి మెటబాలిజం మందగిస్తుంది.
మధ్యాహ్న సమయంలో నీరసాన్ని పోగొట్టుకోవడానికి చాలామంది కూల్ డ్రింక్స్, చక్కెర ఎక్కువగా ఉండే కాఫీ, టీ, ప్యాక్ చేసిన చిప్స్, కుకీల లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతారు. ఈ రకమైన అలవాట్లు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. భోజనం చేసిన తర్వాత గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించే ఎంజైమ్‌ల పనితీరు మందగిస్తుంది. కాబట్టి బరువును నియంత్రణలో (Weight Lose) ఉంచుకోవాలంటే మధ్యాహ్న సమయంలో పోషకాలతో కూడిన స్నాక్స్ ఎంచుకోవడంతోపాటు.. ఆఫీసుల్లో లిఫ్ట్‌లకు బదులు మెట్లు ఎక్కడం, మధ్యమధ్యలో చిన్నపాటి నడక వంటి శారీరక శ్రమను అలవాటు చేసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
Read Also: ఫ్లైట్ మోడ్‌తో ఇన్ని ఉపయోగాలున్నాయా? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!
Follow Us On: X(Twitter)

