కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నగరంలోని వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వాకర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు (Deputy Mayor Sunil Rao) స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ (Karimnagar) లోని కొండ సత్యలక్ష్మీ ఫంక్షన్ హాల్ లో “వాకర్స్ ఇంటర్నేషనల్” డిస్ట్రిక్ట్ 304, కరీంనగర్ రీజియన్ 12 ఆధ్వర్యంలో రెండవ కేబినెట్ సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సమావేశానికి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించేందుకు వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ స్థాపించబడిందని అన్నారు. 304 వాకర్స్ అసోసియేషన్ క్లబ్‌లు స్థాపించి 6 మాసాలు పూర్తైన సందర్బంగా రెండవ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సభ్యులంతా ఏకగ్రీవంగా పలు నిర్ణయాలు తీస్కోని తీర్మానించడం హర్షనీయం అన్నారు. రాబోయే రోజుల్లో వాకర్స్ అసోసియేషన్ క్లబ్ (Walkers Association Club) ద్వారా ఎలాంటి సామాజిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లాలనే ఆలోచనలు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు.
కరీంనగర్‌లో వాకర్స్ అసోసియేషన్ భవనం నిర్మించడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నగరపాలక సంస్థ పక్షాన అవసరమైన నిధులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెల్లి నగరంలోని అంబేడ్కర్ స్టేడియం ఆవరణలో భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించేలా కోరతామని తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ భవన నిర్మాణం చేపడితే రాబోయే తరాలకు అది ఒక స్పూర్తిగా నిలుస్తుందని అన్నారు.
ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం నడక సాగించే వాకర్లు ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్, రీజియన్ ప్రతినిధులు మురళి, గోపాల్ రెడ్డి, మాధవరావు, ఎల్లగౌడ్, కుమార స్వామి, కార్యక్రమ నిర్వాహకులు సుధాకర్ రావు, రమణారెడ్డి, సమ్మిరెడ్డి, రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. అవసరమైతే మళ్లీ యుద్ధం
Follow Us On: Instagram

